బంపర్ ఆఫర్.. ఆడవాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్కీమ్

by Jakkula Samataha |   ( Updated:2024-03-09 07:25:00.0  )
బంపర్ ఆఫర్.. ఆడవాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్కీమ్
X

దిశ, ఫీచర్స్ : కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ తీసుకొచ్చింది.ఈ పథకం ద్వారా మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ పొందవచ్చు. దీని కాల వ్యవధి రెండేళ్లు మాత్రమే. ఇది స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లాంటిదని చెప్పుకోవచ్చు. మార్చి 2025 వరకు దీనిలో పెట్టుబడులు పెట్టుకొనే అవకాశం ఉంది. అయితే పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్కీమ్‌లో ముఖ్యమైన అంశాలు :

ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టాలంటే, ప్రభుత్వ రంగ బ్యాంకులు, భాగస్వామ్య,ప్రైవేట్ బ్యాకులు పోస్టాఫీసులో ఎంఎస్ఎస్సీ ఖాతాను ఓపెన్‌ చేయాలి.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మహిళలకు వయసుతో సబంధం లేదు. ఏ వయసు వారైనా పెట్టుబడి పెట్టవచ్చు.

మైనర్ బాలికైతే చట్టబద్ధమైన సంరక్షుని పేరు మీద ఖాతా ఓపెన్ చేసి, పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ అకౌంట్‌లో 1000 నుంచి 2లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడిపై ఏటా 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఈ వార్షిక వడ్డీని ప్రతి త్రైమాసికం తర్వాత నేరుగా ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు.

పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం మీరు బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు తీసుకోవచ్చు.

ఈ పథకం మెచ్యూరిటీ తర్వాత, ఫారం-2ను పూర్తి చేసి అకౌంట్‌లోని డబ్బు మొత్తం వెనక్కు తీసుకోవచ్చు.

పథకానికి కావాల్సిన అర్హతలు

1. దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి.

2. ఈ పథకం మహిళలు , ఆడపిల్లలకు మాత్రమే.

3. ఏదైనా వ్యక్తిగత మహిళ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

4. మైనర్ ఖాతాను సంరక్షకుడు కూడా తెరవవచ్చు.

5. గరిష్ట వయోపరిమితి లేదు. అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

ఒక వ్యక్తి డిపాజిట్ కోసం గరిష్ట పరిమితికి లోబడి ఎన్ని ఖాతాలను అయినా తెరవవచ్చు. ఇప్పటికే ఉన్న ఖాతాకు, ఇతర ఖాతాలను తెరవడానికి మధ్య మూడు నెలల కాల గ్యాప్ తప్పనిసరి. కనిష్టంగా రూ.1000 తప్పనిసరిగా డిపాజిట్ చేయాలి. ఒక వేళ మీరు మరో అనుబంధ ఖాతా ఓపెన్ చేస్తే అందులో కనీసం వంద రూపాయిలైనా జమచేయాలంట.ఇక గరిష్ట పరిమితి ₹2,00,000/- ఖాతాదారుడి ఖాతాలో జమ చేయాలి.

Advertisement

Next Story