మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజే ఏకంగా..

by Vinod kumar |
మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజే ఏకంగా..
X

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 694 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. క్రితం రోజు కేసులు 483తో పోలిస్తే ఏకంగా 63 శాతం పెరిగాయని వెల్లడిచారు. అయితే మరణాలు ఏమి నమోదు కాకపోవడం కాస్తా ఊరటనిచ్చే అంశంగా ఉంది. అంతకుముందు అక్టోబర్‌లో 972 కొత్త కేసులు నమోదైన తర్వాత ఒక్క రోజులో వెలుగుచూసినవి ఇదే కావడం గమనార్హం. వారం రోజుల క్రితం వరకు పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉండగా, మార్చి 22 నుంచి 28 మధ్యలో 6.15 శాతానికి చేరింది. ముంబై, పూణె, థానే, రాయ్ గఢ్, నాశిక్, సంఘ్లీ జిల్లాలో కేసుల సంఖ్యగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. గుంపులుగా చేరడం తగ్గించి, వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించాలని సూచించింది.

ఢిల్లీలో కేసుల పెరుగుదల.. నేడు కేజ్రివాల్ సమీక్ష..

దేశ రాజధానిలో కేసుల పెరుగుదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని సమీక్షించేందుకు సీఎం కేజ్రివాల్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అయితే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో చేరికలు ఏమి లేవని చెప్పారు. తాము పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఆసుపత్రులు వెళ్లేవారు మాస్క్ ధరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed