రూ.3.14 లక్షల కోట్లతో మధ్యప్రదేశ్ బడ్జెట్..

by Vinod kumar |
రూ.3.14 లక్షల కోట్లతో మధ్యప్రదేశ్ బడ్జెట్..
X

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3.14 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి జగదీష్ దేవ్‌డా తెలిపారు అయితే మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ విపక్ష కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశారు. ముందుగా అసెంబ్లీలో గ్యాస్ ధరలు పెంచాడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రులు తరుణ్ భనోత్, విజయ్ లక్ష్మీ సాధూ, జితూ పట్వారీ నిరసన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత మాజీ సీఎం కమల్ నాథ్ తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర గృహ వినియోగ సిలిండర్ పై రూ.50, వాణిజ్య వినియోగ సిలిండర్ పై రూ.300 పెంచి ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. రాజస్థాన్ ప్రభుత్వం తరహాలో మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా రూ.500 లకే సిలిండర్ గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 8 నుంచి మహిళలకు రూ.1000 భత్యం ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed