Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపులు

by Shamantha N |
Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో(Lucknow) మరో ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపులు(Bomb Threat) రావడం కలకలం రేపాయి. సోమవారం తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటలకే ఇలా బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. హజ్రత్‌గంజ్‌ ప్రాంతం (Hazratganj area)లో ఉన్న తాజ్‌ హెటల్‌ (Taj Hotel)కు సోమవారం ఉదయం ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు హోటల్‌ ఆవరణలో బాంబు పెట్టినట్లు అందులో పేర్కొన్నాడు. అప్రమత్తమైన హోటల్‌ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసు అధికారులు బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ దొరకలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు

కోల్‌కతాలోని 10 ప్రముఖ హోటళ్లకు, రాజ్‌కోట్‌లో 10 హోటళ్లకు, లక్నోలో 10 ప్రధాన హోటళ్లకు ఆదివారం ఈ-మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న మూడు హోటళ్లకు శుక్ర, శనివారాల్లో నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. హోటళ్లకే కాదు దాదాపు 50 విమానాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గడచిన 14 రోజుల్లో 350కిపైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.

Advertisement

Next Story