నడిరోడ్డుపై స్నానం చేసిన లవర్స్.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

by Anjali |   ( Updated:2023-05-19 03:42:52.0  )
నడిరోడ్డుపై స్నానం చేసిన లవర్స్.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపడుతున్న విషయం తెలిసిందే. అనేక ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు ఎండలు తట్టుకోలేక ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసి సేద తీరుతున్నారు. మరికొంతమంది బయటకు వెళ్లడం తప్పనిసరి అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఇద్దరు లవర్స్ వేడిని తాళలేక నడిరోడ్డుపై స్కూటీలో బకెట్‌లో నీటిని పెట్టుకొని ప్రయాణం చేస్తూ, దారిలో స్నానం చేశారు. ఈ విడ్డూరాన్ని చూసిన ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ వీడియోలో.. బకెట్‌‌లో తీసుకొచ్చిన వాటర్‌ను యువతి మగ్గు సాయంతో అబ్బాయిపై పోసిన తర్వాత తనపైనా కూడా పోసుకుంటుంది. అంత వేడి భరించకపోతే ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొవాలని కొందరు, గొడుగులు, టోపీలు వాడాలి కానీ.. ఇదేం విచిత్రమైన పని అంటూ మరికొందరు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అలాగే తోటి ప్రయాణికులు.. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story