జాబ్ కోసం వెతుకుతూ రూ. 5.3 లక్షలు పోగొట్టుకున్న మహిళ

by Hamsa |   ( Updated:2023-01-28 10:01:05.0  )
జాబ్ కోసం వెతుకుతూ రూ. 5.3 లక్షలు పోగొట్టుకున్న మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైకి చెందిన డాఫ్నే ఫెర్నాండెజ్ అనే 39 ఏళ్ల మహిళ పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతుకుతూ రూ. 5.3 లక్షలు పొగొట్టుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాల కోసం వెతుకుతున్న ఫెర్నాండెజ్‌కి వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ వచ్చింది. అక్కడ ఆన్‌లైన్ టాస్క్‌లను పూర్తి చేస్తే జాబ్ లభిస్తుందని తెలిపారు. అయితే ఆమె దానిని పూర్తి చేసే క్రమంలో నిందితులు రూ. 5.3 లక్షలను కొల్లగొట్టారు. ఎక్కువ పెట్టుబడి పెడితే అధిక సాలరీ ఇస్తామని నిందితుడు ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె భారీ నగదును చెల్లించేందుకు ఒప్పుకోగా వాటిని నిందితుడు కొల్లగొట్టాడు. చివరికి మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed