LG Saxena: అతిశీని తాత్కాలిక సీఎంగా అభివర్ణించడం బాధాకరం.. ఎల్జీ వీకే సక్సేనా

by vinod kumar |
LG Saxena: అతిశీని తాత్కాలిక సీఎంగా అభివర్ణించడం బాధాకరం.. ఎల్జీ వీకే సక్సేనా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అతిశీ (Athishi)ని ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) తాత్కాలిక సీఎంగా అభివర్ణించడంపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా (vk Saxena) స్పందించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని, ఇవి ఎంతో అభ్యంతరంగా ఉందని తెలిపారు. ఈ మేరకు అతిశీకి తాజాగా ఓ లేఖ రాశారు. కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ‘కేజ్రీవాల్ మిమ్మల్ని బహిరంగంగా తాత్కాలిక సీఎంగా పేర్కొన్నారు. దీనిని ఎంతో అభ్యంతరకరంగా భావించా. అంతేగాక ఈ అంశం ఎంతో బాధ కలిగించింది. ఇది మీకు మాత్రమే కాదు దేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముకు, మీ ప్రతినిధిగా నాకు కూడా అవమానకరం’ అని లేఖలో పేర్కొన్నారు. ఒకరిని తాత్కాలికంగా పేర్కొనడం అంబేద్కర్ సూత్రాలకు, భారత రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. సీనియర్ సిటిజన్లు, మహిళలకు సంబంధించిన పథకాలపై కేజ్రీవాల్ చేసిన అనధికారిక ప్రకటనలు సీఎం కార్యాలయాన్ని బలహీనపరిచాయని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed