- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:నకిలీ నోట్ల ముఠా అరెస్టు
దిశ ప్రతినిధి, ఏలూరు: ద్వారకాతిరుమల యాదవ కళ్యాణ మండపం వద్ద నకిలీ కరెన్సీ మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తులను ద్వారకాతిరుమల పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 2,50,000/-ఒరిజినల్ నగదు. 15,00,000/-నకిలీ (దొంగ) నోట్లు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్. 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్‌పి కొమ్మి ప్రతాప శివ కిశోర్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం, తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన కోడూరి రవితేజ అనే వ్యక్తి ప్రస్తుతం జంగారెడ్డి గూడెం లో నివాసం ఉంటూ, కొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. దొంగనోట్లను మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది, ఈ క్రమంలో కోడూరి రవితేజ ద్వారకాతిరుమలలో రోడ్డు పక్కనే హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్న కొల్లి సుబ్రహ్మణ్యం @ సుభాష్ అనే వ్యక్తిని 2,50,000 ఒరిజినల్ డబ్బులు ఇస్తే 15,00,000 నకిలీ డబ్బులు ఇస్తానని ప్రలోభపెట్టడాడు.
తన ముఠాలోని షేక్ నాగూర్ మీరావలి, వీరంకి రాజేష్ అనే వ్యక్తుల ద్వారా ద్వారకాతిరుమలకు నకిలీ నోట్లను పంపి సుభాష్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న 2,50,000/- అసలు కరెన్సీ నోట్లను మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి సుదీర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. నకిలీ నోట్లు కలిగి ఉన్న షేక్ నాగూర్ మీరావలి , వీరంకి రాజేష్, నకిలీ నోట్ల కోసం ఒరిజినల్ డబ్బులు తీసుకుని వెళ్లిన ద్వారకాతిరుమల కు చెందిన కొల్లి సుబ్రహ్మణ్యం @ సుభాష్ అను వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుజె విల్సన్ పర్యవేక్షణలో, ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి సుధీర్ తన సిబ్బందితో కలసి నకిలీ నోట్ల కేసును ఛేధించారు. కేసును ఛేదించిన అధికారులను సిబ్బందిని ఎస్‌పి శివ కిశోర్ ప్రశంసించి రివార్డు అందచేశారు.