- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maharashtra :టీషర్టులపై లారెన్స్ బిష్ణోయ్, దావూద్ ఇబ్రహీం ప్రింట్స్
దిశ, నేషనల్ బ్యూరో : గ్యాంగ్ స్టర్లు, టెర్రరిస్టుల ఫొటోలతో టీ షర్టులు సేల్‌కు పెట్టిన ఈ-టైలర్లపై మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్, వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంల ఫొటోలు ఉన్న టీషర్టులు ఫ్లిప్ కార్ట్, అలీ ఎక్స్‌ప్రెస్, టీ షాపర్, ఇట్సీలలో అమ్మకానికి ఉంచినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ ఉత్పత్తుల్లో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాతో పాటు అనేక మర్డర్లు చేసిన లారెన్స్ బిష్ణోయ్, టెర్రరిస్ట్ అటాక్‌లను అమలు చేసే దావూద్ ఇబ్రహీంలను కీర్తిస్తున్నట్లు సంకేతాలు వె
ళ్తాయని, దీంతో యువతపై నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ సైబర్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మాట్లాడుతూ.. ఈ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచిన వారిపై, అలాగే వాటిని అమ్మకానికి ఉంచిన ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఫ్లిప్ కార్ట్, అలీ ఎక్స్‌ప్రెస్, టీ షాపర్, ఇట్సీలపై సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ చర్యలు ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేస్తాయని అన్నారు. భారతీయ న్యాయ సంహితలోన సెక్షన్ 192, 196, 353, ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.