Kedarnath: కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య

by Shamantha N |
Kedarnath: కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ లో కేదార్‌నాథ్ (Kedarnath) మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. సోమవారం సోన్‌ప్రయాగ్- గౌరీకుండ్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో కొందరు యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా.. ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో ముగ్గురు గాయపడగా.. వారిని హాస్పిటల్ కు తరలించారు. సోమవారం రెండు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీయగా.. మంగళవారం మరో ముగ్గురి డెడ్ బాడీలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు ఉంటార‌ని రుద్ర‌ప్ర‌యాగ్ పోలీసులు భావిస్తున్నారు. కేదారీశ్వ‌రుడిని ద‌ర్శ‌నం చేసుకుని వెన‌క్కి వ‌స్తున్న భ‌క్తులు.. సోమ‌వారం రాత్రి 7.30 నిమిషాల‌కు విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌ల్లో చిక్కుకుని ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

సవాల్ గా మారిన రెస్క్యూ ఆపరేషన్

రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ.. "కొండచరియలు విరిగిపడుతుండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్ సవాల్ గా మారింది. సోమవారం అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశాం. మంగళవారం తెల్లవారుజామునే తిరిగి ప్రారంభించారు. మరికొంతమిం యాత్రికులు చిక్కుకునే అవకాశం ఉంది. అందుకే, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాం" అని అన్నారు. ఎస్డీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు సంయుక్తంగా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొనసాగిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed