- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ladakh: లఢక్ లో కొత్తగా 5 జిల్లాల ఏర్పాటు
దిశ, నేషనల్ బ్యూరో: లఢక్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లఢక్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని ఆయన ప్రకటించారు. అక్కడ కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ‘లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్తగా జంస్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్ తంగ్ జిల్లాల ఏర్పాటుతో జమ్ములో పాలనను బలోపేతం చేస్తాం. ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు ప్రతి ఇంటికి దక్కుతాయి.’ అని అమిత్ షా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
స్పందించిన మోడీ
ఐదు జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు మెరుగైన పాలన, శ్రేయస్సుకు ఇదో ముందడుగు. జంస్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ ఇప్పుడు ప్రజల దృష్టిని మరింతగా ఆకర్షిస్తాయి. ప్రజలకు సేవలు, అవకాశాలను మరించ చేరువ చేస్తాయి. అక్కడి ప్రజలకు అభినందనలు’ అని మోడీ సోషల్ మీడియాలో వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయ్యాయి. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లఢక్.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాలనా నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ లేహ్, కార్గిల్ రెండు జిల్లాలు ఉన్నాయి. అయితే, ఈ కొత్త నిర్ణయంతో ఈ జిల్లాల సంఖ్య ఏడుకు పెరగనుంది.