Haryana CM : హర్యానా సీఎం రేసులో నేనూ ఉన్నాను : కుమారి సెల్జా

by Hajipasha |
Haryana CM : హర్యానా సీఎం రేసులో నేనూ ఉన్నాను : కుమారి సెల్జా
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు (శుక్రవారం) కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ కుమారి సెల్జా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల జాబితాలో తన పేరు కూడా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా పార్టీ అధిష్టానం తన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉందన్నారు. సీనియారిటీ, పార్టీ కోసం పనిచేస్తున్న తీరు ఆధారంగా సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని కుమారి సెల్జా చెప్పారు.

కాంగ్రెస్ కోసం అంకితభావంతో పనిచేసే విషయంలో తన నిబద్ధతపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని, దీన్ని పార్టీ కూడా పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వాసం వెలిబుచ్చారు. గురువారం రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీలో పార్టీకి, ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగిందని కుమారి సెల్జా పేర్కొన్నారు. కాగా, హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఈనెల 8న విడుదల కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed