FORDA: సోమవారం దేశవ్యాప్తం వైద్యసేవల నిలిపివేత

by Shamantha N |
FORDA: సోమవారం దేశవ్యాప్తం వైద్యసేవల నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్యసేవలు నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(FORDA) తెలిపింది. జూనియర్‌ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోర్డా నిన్న కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్‌లైన్‌ ఇచ్చింది. లేకపోతే ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇక, ఇప్పుడేమో వైద్యసేవలు నిలిపివేస్తామంది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోర్డా లేఖ రాసింది. ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేడీ వైద్యులకు మద్దతుగా ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరగాలని పేర్కొంది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరింది. అన్ని వర్గాల ప్రజలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది.

పీజీ వైద్యవిద్యార్థిని దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో పీజీ వైద్యవిద్యార్థిని దారుణ హత్య జరిగింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది. గురువారం రాత్రి విధుల్లో ఉన్న ఆమె.. శుక్రవారం ఉదయం ఆస్పత్రి సెమినార్‌ హాలులో శవమై కన్పించారు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఒక సివిక్ వాలంటీర్ ని అరెస్టు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన బ్లూటూత్ ఆధారంగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed