Kolkata doctor case: రోజూ రోటీలేనా.. నాకు ఎగ్ నూడుల్స్ కావాలి

by Shamantha N |   ( Updated:2024-08-31 11:37:11.0  )
Kolkata doctor case: రోజూ రోటీలేనా.. నాకు ఎగ్ నూడుల్స్ కావాలి
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్ కతా హత్యాచార కేసులో ప్రధాని నిందితుడు సంజయ్ రాయ్ గురించి రోజుకో వార్త బయటకొస్తుంది. ఈ కేసులో సీబీఐ సంజయ్ ని అదుపులోకి విచారణ జరుపుతోంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండి కేసు విచారణను ఎదుర్కొంటున్న సంజయ్‌ రాయ్‌.. జైలు సిబ్బంది పెట్టే ఆహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిబ్బంది రోజూ రోటీ సబ్జీ ఇస్తుండటంపై సంజయ్‌ కోపానికి వస్తున్నట్లు సమాచారం. ‘రోజూ రోటీలేనా.. నాకు ఎగ్‌ నూడుల్స్‌ కావాలి’ అని రాయ్‌ డిమాండ్‌ చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, జైల్లో అందరికీ ఒకే ఆహారం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. తను అడిగింది ప్రత్యేకంగా తెచ్చి ఇవ్వడం కుదరదని జైలు సిబ్బంది కోపంగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో, సంజయ్‌ రాయ్‌ సైలంట్ గా రోటీ సబ్జీ తీసుకున్నట్లు సమాచారం. ఇఖపోతే, కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది. ఈ కేసులో సివిక్ వాలంటీరు సంజయ్ రాయ్ ప్రధాని నిందితుడు కాగా.. ఆయన్ని సీబీఐ విచారణ జరపుతోంది.

Advertisement

Next Story

Most Viewed