Telugu Crime news : భర్తను హతమార్చిన భార్య.. కారణం ఏంటంటే..?

by Rani Yarlagadda |   ( Updated:2024-10-25 08:04:16.0  )
Telugu Crime news : భర్తను హతమార్చిన భార్య.. కారణం ఏంటంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకీ మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమగా పెంచుకున్న జంతువులకు మనుషుల పట్ల ఉన్నపాటి విశ్వాసం, ఆప్యాయత.. సాటి వ్యక్తిపై ఉండటం లేదు. ఇంట్లోనే రకరకాల గొడవలతో చంపుకునే వరకూ వెళ్తున్నారు. వాళ్లు రక్త సంబంధికులైనా, స్నేహితులైనా ఆలోచించడమే లేదు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక గొడవలు.. ఇలా రకరకాల కారణాలతో నిత్యం హత్యలు జరుగుతూనే ఉన్నాయి.

కాకినాడ (Kakinada) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లూ కష్టసుఖాల్లో తోడుంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను గాలికొదిలేసి.. ప్రియుడి మోజులో భర్తనే హతమార్చిందో భార్య. తమ బంధానికి (Extra Marital Affair) అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి.. భర్తను అంతమొందించింది. తొండంగి మండలం ఏవీ నగరంలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరీష అనే మహిళ బట్టెన మధుబాబును 2014లో పెళ్లాడింది. ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమెకు పీతల ప్రశాంత్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఒకరోజు శిరీష - ప్రశాంత్ లు ఇంట్లో ఏకాంతంగా ఉండగా.. వారిద్దరినీ మధుబాబు చూశాడు. దాంతో అప్పటి నుంచి విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన శిరీష - ప్రశాంత్ లు మధుబాబుని చంపాలని ప్లాన్ చేశారు. పక్కా ప్రణాళికతో హత్య చేశారు. మధుబాబు తాగుడుకు బానిసై చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులు ప్రస్తుతం హత్యకేసుగా కేసు ఫైల్ చేసి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed