IND vs NZ 2nd Test: కుప్పకూలిన టాప్ ఆర్డర్.. పీకల్లోతు కష్టాల్లో భారత్

by Mahesh |   ( Updated:2024-10-25 06:19:24.0  )
IND vs NZ 2nd Test: కుప్పకూలిన టాప్ ఆర్డర్.. పీకల్లోతు కష్టాల్లో భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ పూణే(Pune) వేదికగా జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు న్యూజిలాండ్(New Zealand) జట్టును ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. న్యూజిలాండ్ బౌలర్లు భారత ప్లేయర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో భారత టాప్ ఆర్డర్(Top Order) మొత్తం కుప్పకూలిపోయింది. మొదటి రోజు చివరి సెషన్ లో రోహిత్(Rohit) అవుట్ కాగా రెండో రోజు మొదటి సెషన్ లోనే ఏకంగా ఆరుగురు ప్లేయర్లు అవుట్ అయ్యారు. లంచ్ సమయం ముగిసే సమయానికి 38 ఓవర్లను ఆడిన భారత(India) జట్టు 7 వికెట్లను కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో జైస్వాల్ 30, గిల్ 30, పంత్ 18 మినహా ఎవరూ సరిగ్గా రాణించలేదు. కెప్టెన్ రోహిత్ 0, విరాట్ కోహ్లీ 1 పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో భారత్ మొదటి సెషన్ లోని 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా, సుందర్ ఉన్నారు. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 1, మిచెల్ శాంట్నర్ 4, గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

Next Story