Zeeshan Siddique: అజిత్ పవార్ ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్

by Shamantha N |   ( Updated:2024-10-25 06:34:31.0  )
Zeeshan Siddique: అజిత్ పవార్ ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్‌ సిద్ధిఖీ(Zeeshan Siddique) ఎన్సీపీ(Nationalist Congress Party) కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో జిషాన్ అజిత్‌ పవార్‌ వర్గంలో చేరినట్లుగా తెలుస్తోంది. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్‌ నుంచి జిషాన్‌ను బరిలో దింపుతున్నట్లుగా అజిత్ పవార్ పార్టీ వెల్లడించింది. . ‘‘నాకు, నా కుటుంబానికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. మేం కష్టంలో ఉన్నప్పుడు మావెంట ఉండి ధైర్యం చెప్పిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు ధన్యవాదాలు. బాంద్రా నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నా. ప్రజల ప్రేమ, మద్దతుతో మళ్లీ గెలుస్తానని నమ్ముతున్నాను’’ అని అన్నారు.

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా..

గతంలో జిషాన్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, శాసనమండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అతడికి టికెట్‌ దక్కలేదు. దీంతో, ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్సీపీ పవార్‌ వర్గం నేత అయిన జిషాన్‌ తండ్రి బాబా సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితమే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ దారుణంగా హత్య చేసింది. ఇలాంటి సమయంలో ఆయన పవార్ వర్గంలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపోతే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్‌ 20న ఒకే దశలో పోలింగ్‌ జరగగా.. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. ఇకపోతే, శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed