- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyber Crime : క్రెడిట్ కార్డు పేరుతో వల..రెండు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసిన కేటుగాళ్లు
దిశ, పర్వతగిరి: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో రెండు ఖాతాలు ఉన్నాయి. యువకుడికి వాట్సాప్ ద్వారా క్రెడిట్ కార్డు ఇస్తామని పరిచయం చేసుకొని యాప్ ని డౌన్లోడ్ చేసుకోమని సదరు మోసగాళ్లు బాధితుడి ఆధార్, పాన్ కార్డ్ వాట్సప్ ద్వారా పంపియమన్నారు. పంపిన తర్వాత స్క్రీన్ మిర్రరింగ్ యాక్సెస్ తో కూడిన ఏపీకే ఫైల్స్ యాప్ ని పంపించారు. సదరు యువకుడు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే రెండు అకౌంట్లలో ఉన్న రూ. 14 వేలను సైబర్ నేరస్తులు కాజేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1903 కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
ఓటీపీ,బ్యాంకు వివరాలు కొత్తవారికి షేర్ చేయకండి : పర్వతగిరి ఎస్సై
పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ కేవైసీ వివరాల కోసం బ్యాంకులు ఎప్పుడూ లింకులు పంపవని,యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు లేదా కార్డ్ సమాచారం వంటి సున్నితమైన వివరాలను సోషల్ మీడియాలో ఎవరితోనూ ఎప్పుడు షేర్ చేయవద్దన్నారు.బ్యాంకులు, RBI లేదా ఆర్థిక సంస్థలు వంటి నిజమైన సంస్థలు ఈ సమాచారాన్ని అభ్యర్థించవని వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్ లో వాడేవారు గ్రహించాలని కోరారు. అవాంఛిత యాప్ లను గుర్తించే "ఎం కవచ్ 2" యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కొంతమేరకు ఫోన్ ప్రొటెక్షన్ లో ఉంటుందని అన్నారు.