Kiren rijiju: కాంగ్రెస్ పాలన కొనసాగితే గోవా పతనమయ్యేది: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

by vinod kumar |
Kiren rijiju: కాంగ్రెస్ పాలన కొనసాగితే గోవా పతనమయ్యేది: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, నేషనల్ బ్యూరో: గోవాలో కాంగ్రెస్ పాలన కొనసాగితే రాష్ట్రం ఇప్పటికే పతనమయ్యేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే గోవా ఆధునీకరించబడిందని తెలిపారు. గోవా పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఆ రాష్ట్ర రాజధాని పనామాలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ సహకారంతో గోవా ఎంతో రూపాంతరం చెందిందన్నారు. గోవాలో మౌలిక సదుపాయాల కల్పించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గోవాలో పర్యాటక రంగం వృద్ధికి ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎంతో సహాయపడుతుందన్నారు. దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా గోవా ఆవిర్భవిస్తుందని, గోవా ఎప్పుడూ అందంగా ఉంటుందని చెప్పారు. అయితే దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు.‘సస్టైనబుల్ టూరిజం వృద్ధి ముఖ్యం. దీని కోసం పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలి. గోవాను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడానికి స్థిరంగా అభివృద్ధి చేయాలి’ అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed