- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi: ఢిల్లీలో డ్రగ్స్ 'కింగ్‌పిన్' అరెస్ట్.. 1.3 కిలోల కొకైన్ స్వాధీనం
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలోని సౌత్-ఈస్ట్ జిల్లాకు చెందిన యాంటీ నార్కొటిక్ స్క్వాడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ నాగోర్ సెర్జీ పాకోమ్‌ను అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. సన్‌లైట్ కాలనీలో నిర్వహించిన దాడిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసు అధికారులు రూ. 13 కోట్లు విలువైన కొకైన్, ఏడు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటర్, రూ. 11,900 నగదు, ప్యాకింగ్ మెటీరియల్స్, డిజిటల్ వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. జూన్ 15న సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరి నగర్ ఆశ్రమంలో నైజీరియాకు చెందిన అనెన్ చుక్వా, లివినస్ అనే ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు పట్టుబడ్డారు. వారి నుంచి 386 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన తర్వాత పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు బుధవారం ఆపరేషన్ ద్వారా డ్రగ్స్ కింగ్‌పిన్‌ను గుర్తించారు. నిందితుడి ఫ్లాట్‌లో సోదాలు చేయగా రూ. 13 కోట్ల విలువ 1.321 కిలోల కొకైన్ లభించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.