యూకేలో మొదటిసారిగా చలామణిలోకి కింగ్ చార్లెస్3 కరెన్సీ నోట్లు

by S Gopi |
యూకేలో మొదటిసారిగా చలామణిలోకి కింగ్ చార్లెస్3 కరెన్సీ నోట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూకేలో కింగ్ చార్లెస్3 ఫోటోతో ఉన్న కరెన్సీ నోట్లు తొలిసారిగా చలామణిలోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం చలామణిలో ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో ఇచ్చేయాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రజలను కోరింది. దీంతో బ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ నోట్లపై ఉన్న రెండో బ్రిటీష్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ 3 నిలిచారు. కొత్త నోట్లలో కింగ్ చార్లెస్3 ఫోటో మాత్రమే వేరుగా ఉంటుందని, ఇతర వివరాలు అలాగే ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వెల్లడించింది. 2022, సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ మరణించిన తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో కింగ్ చార్లెస్ ఉన్న నోట్లను విడుద చేశారు. కొత్త నోట్లు ఇప్పటికే ఉన్న వాటి స్థానంలో చలామణిలోకి వస్తాయి. కాబట్టి కింగ్ చార్లెస్3 ఉన్న నోట్లు క్రమంగా వ్యవస్థలోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆండ్రూ బెయిలీ చెప్పారు. ఇది చారిత్రాత్మక క్షణం, నోట్లలో మార్పుచేయడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పాత నోట్లను ప్రజలు జూన్ 5 నుంచి జూన్ 30 వరకు మార్చుకునే వీలుంటుందని, ఒకరికి 300 యూరోల వరకు అవకాశం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేర్కొంది. నోట్లు మార్చుకోవాలనుకునే ప్రజలు నిర్దేశించిన తేదీల్లో దరఖాస్తు ఫారం ద్వారా కూడా నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. పాత క్వీన్ ఎలిజబెత్2 ఉన్న నోట్లు కూడా కొత్త వాటితో పాటు చెల్లుబాటులోనే ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story