కాంగ్రెస్ అభ్యర్థులతో ఖర్గే, రాహుల్ భేటీ..కౌంటింగ్ వ్యూహాలపై కీలక చర్చ!

by vinod kumar |
కాంగ్రెస్ అభ్యర్థులతో ఖర్గే, రాహుల్ భేటీ..కౌంటింగ్ వ్యూహాలపై కీలక చర్చ!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఆదివారం భేటీ కానున్నారు. ఈ మేరకు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 1 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నేతలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ మీటింగ్‌లో ప్రధానంగా జూన్ 4న జరిగే కౌంటిగ్ సన్నద్దతపై పార్టీ అభ్యర్థులకు పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి తమ పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed