- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kharge: గడువు ప్రకారమే ఎన్నికలు జరగాలి.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ ప్రజలు సాధారణ స్థితి కోసం సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం ఎన్నికలు జరగాలని, 'అధికార పాలన' అనే ఈ యంత్రాంగానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమ్మూ & కాశ్మీర్, లడఖ్ ప్రజల జీవన విధానం పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. జమ్మూ & కాశ్మీర్, లడఖ్‌లపై బీజేపి విధానం 'కాశ్మీరియత్'ను గౌరవించదు లేదా 'జంహురియత్'ను సమర్థించదు! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చర్య జమ్మూ కాశ్మీర్‌ను పూర్తిగా సమగ్రపరచడానికి, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధిని పెంచడానికి, ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని నిరోధించడానికి సహాయపడుతుందని మోడీ ప్రభుత్వం పేర్కొంటుంది. కానీ ఇది వాస్తవికతకు పూర్తిగా భిన్నమైనదని అన్నారు.
2019 నుండి 683 ఘోరమైన ఉగ్రవాద దాడులు జరిగాయని, ఫలితంగా 258 మంది భద్రతా సిబ్బంది బలిదానం చేయాల్సి వచ్చిందని, అలాగే 170 మంది పౌరుల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా, పీఎం మోడీ మూడవ ప్రమాణం నుండి జమ్మూ ప్రాంతంలో 25 ఉగ్రదాడులు జరిగాయని, ఇందులో 15 మంది సైనికులు మరణించగా.. 27 మంది గాయపడ్డారని అన్నారు. ఇక గత కొన్నేళ్లుగా కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. అలాగే జమ్మూ & కాశ్మీర్‌లో 2019 నుండి 65% ప్రభుత్వ శాఖ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగం రేటు 10% వద్ద ఉందని, యువత నిరుద్యోగిత రేటు 18.3% ఉందని, అన్నారు. 2021లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, కేవలం 3% పెట్టుబడులు మాత్రమే భూమిపై కార్యరూపం దాల్చాయని, ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ 2015 కింద 40% ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలియజేశారు.
అంతేగాక జమ్మూ మరియు కాశ్మీర్ నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు 13.28% (ఏప్రిల్ 2015-మార్చి 2019) నుండి 2019 తర్వాత 8.73%కి తగ్గిందని సూచించారు. జమ్ము మరియు కాశ్మీర్, లడఖ్ ప్రజలు సాధారణ స్థితి కోసం ఆరాటపడుతున్నారని, భారత్ జోడో యాత్ర సందర్భంగా వారు రాహుల్ గాంధీకి ఈ భావాన్ని తెలియజేశారని తెలిపారు. ఇక సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం ఎన్నికలు జరగాలని, తద్వారా ప్రజలు తమ ప్రతినిధులను సొంతంగా ఎన్నుకునేలా, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి, 'అధికార పాలన' అనే ఈ యంత్రాంగానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో అంతర్భాగమైన ఈ ప్రాంతాల ప్రజలతో దృఢంగా నిలుస్తుందని ఖర్గే ఎక్స్ లో రాసుకొచ్చారు.