భారత్‌లో కొత్త వైరస్ కలకలం.. ఇన్ఫెక్షన్‌తో టీనేజర్ మృతి

by Vinod kumar |
భారత్‌లో కొత్త వైరస్ కలకలం.. ఇన్ఫెక్షన్‌తో టీనేజర్ మృతి
X

తిరువనంతపురం: దేశంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళలోని అలప్పుజా జిల్లాలో స్వేచ్ఛగా జీవించే అమీబాల వల్ల అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. పనవల్లి గ్రామంలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారిన పడిన 15 ఏళ్ల టీనేజర్ మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు ఐదు నమోదయ్యాయని చెప్పారు. 2016లో అలప్పుజలోని తిరుమల వార్డులో తొలి కేసు నమోదైందని ఆమె పేర్కొన్నారు. మలప్పురంలో 2019, 2020ల్లో మరో రెండు కేసులు నిర్ధారించబడ్డాయి. 2020, 2022 సంవత్సరాల్లో కోజికోడ్, త్రిసూర్ నగరాల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.

ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ. మెదడుకు వ్యాపించే ఈ వ్యాధి సోకిన రోగులంతా మరణించారని జార్జ్ తెలిపారు. ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే స్వేచ్ఛా జీవి అమీబా నిశ్చల నీటిలో కనిపిస్తుందని మంత్రి తెలిపారు. నాన్ పారాసిటిక్ అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషి మెదడుకు ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు కలుషిత నీటిలో స్నానం చేయొద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed