- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూనియర్‌ను 29 గంటలు వేధించి చంపిన సీనియర్లు
దిశ, నేషనల్ బ్యూరో : దారుణం.. ఘోరం.. పైశాచికం.. ఇలా ఏ పదాన్ని వాడినా మనం చెప్పుకోబోయే ఘటనకు సరిపోదు!! ఓ విద్యార్థిని సీనియర్లు, తోటి విద్యార్థులు కలిసి దాదాపు 29 గంటల పాటు కంటిన్యూగా హాస్టల్‌లో టార్చర్ చేశారు. బెల్టుతో కొట్టారు. చేతులతో ఇష్టం వచ్చినట్టుగా పిడిగుద్దులు కురిపించారు. ఈ వేధింపులు ఎదురైన తర్వాత బాధిత విద్యార్థి తీవ్ర నైరాశ్యంలోకి జారుకున్నాడు. జీవితంపై విరక్తిని పెంచుకున్నాడు. టార్చర్ జరిగిన ఒకరోజు తర్వాత బాధిత విద్యార్థి అదే హాస్టల్‌లోని బాత్‌రూంలో ఉరివేసుకున్నాడు. ఈ అమానుష ఘటనకు కేరళలోని వయనాడ్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ సెకండియర్ విద్యార్థి సిద్ధార్థన్ జేఎస్(20) బలయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఈ కేసుపై విచారణను సీబీఐ చేపట్టింది. సీబీఐకి పోలీసులు సమర్పించిన దర్యాప్తు నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యార్థి సిద్ధార్థన్‌ను సీనియర్లు, క్లాస్‌మేట్లు కలిసి దారుణంగా వేధించారు. ఫిబ్రవరి 18న మధ్యాహ్నం కాలేజీ హాస్టల్‌లోని బాత్రూమ్‌లో సిద్ధార్థన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో సంబంధమున్న 20 మందిపై వయనాడ్‌లోని వైతిరి పోలీస్ స్టేషన్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించింది. ఫోరెన్సిక్ బృందంతో కూడిన సీబీఐ టీమ్ త్వరలోనే వయనాడ్‌లో పర్యటించనుంది.