- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Supreme Court: రాజకీయాలు, మతాన్ని కలిపి చూడొద్దు.. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. మతం, రాజకీయాన్ని కలిపి చూడొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వాడినట్లు సాక్ష్యం ఉందా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ అంశంలోనైనా అనుమానం ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం... ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో.. ఈ ఘటనలో నెయ్యిని మరోసారి టెస్టు చేసేందుకు ఇంకో ల్యాబ్ కి ఎందుకు పంపలేదని అడిగింది.
ఏపీ సీఎంపై ఫైర్
అంతే కాకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా... సిట్ ఏర్పాటు కాకముందే ఎందుకు ప్రకటన చేశారని మండిపడింది. “మీరు (ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు) రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్నప్పుడు.. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని మేం ఆశిస్తున్నాం. మీరు ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లయితే, మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? జులైలో ల్యాబ్ రిపోర్టు వచ్చింది. మీ ప్రకటన సెప్టెంబర్ లో వచ్చింది. అంతేకాక నివేదిక స్పష్టంగా లేదు” అని కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ జరగకముందే ఇలాంటి ప్రకటన చేయటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని సుప్రీంకోర్టు మండిపడింది. సెప్టెంబర్ 18న సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. టీటీడీ అధికారే స్వయంగా కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యిని ఉపయోగించలేదని చెబుతున్నారని, ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. అంతే కాదు ప్రస్తుత సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. సుదీర్ఘ విచారణ తర్వాత గురువారానికి వాయిదా వేసింది.