కర్ణాటక రిజల్ట్స్ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ‘జై బజ్‌రంగ్ బలి’ నినాదాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-13 05:54:44.0  )
కర్ణాటక రిజల్ట్స్ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ‘జై బజ్‌రంగ్ బలి’ నినాదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తం 224 స్థానాలకు గాను 120 స్థానాల్లో కాంగ్రెస్, 72 స్థానాల్లో బీజేపీ, 28 స్థానాల్లో జేడీఎస్, 4 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు హనుమంతుడి వేషాధారణలో హస్తం పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోలిస్తే 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ‘‘బజ్ రంగ్ బలి బీజేపీ కే సాత్ నహీ, కాంగ్రెస్ కే సాథ్ హే.. బజ్ రంగ్ బలి నే బీజేపీ పర్ ఫైన్ లగాయే’(బజ్ రంగ్ బలి ఈ సారి బీజేపీతో లేరు.. కాంగ్రెస్ తో ఉన్నారు.. బజ్ రంగ్ బలి బీజేపీకి ఫైర్ వేశారు) అంటూ హనుమాన్ వేషాధారణలో ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

Also Read...

.హైదరాబాద్‌కు మారుతోన్న కన్నడ పాలిటిక్స్.. స్టార్ హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్!

Advertisement

Next Story