సుదీప్‌ సినిమాల ప్రసారాలపై నిషేధం విధించండి: జేడీఎస్

by Hamsa |   ( Updated:2023-04-07 10:07:36.0  )
సుదీప్‌ సినిమాల ప్రసారాలపై నిషేధం విధించండి: జేడీఎస్
X

బెంగళూరు: కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌కు జనతా దళ్ సెక్యులర్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయన చిత్రాలపై నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతూ శుక్రవారం లేఖ రాసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించింది. దీంతో ఆయన నటించిన చిత్రాలు, షోస్, యాడ్స్ ప్రసారాలపై నిషేధం విధించాలని కోరింది. కాగా, బీజేపీ తరుఫున ప్రచారం చేయనున్నట్లు సుదీప్ రెండు రోజుల క్రితం నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీనిపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈక్రమంలో పార్టీలో చేరకుండా కేవలం తన సన్నిహితులు తరుఫున ప్రచారం చేస్తానని సుదీప్ పేర్కొన్నారు. సీఎం బొమ్మై కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. సుదీప్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని అన్నారు. మరో నటుడు ప్రకాష్ రాజ్ కూడా సుదీప్ నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed