- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో గెలిచి.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని వెల్లడించారు. కర్ణాటక ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయానికి తలుపులు తెరుస్తాయని చెప్పారు. ఓ మీడియా సంస్థకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్ 141 సీట్లల్లో గెలుపొందుతుందని అంచనా వేశారు.
రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం స్థానిక సమస్యలు, అభివృద్ధిపైనే దృష్టిసారించారని, కాబట్టి ఈసారి కర్ణాటకలో మోడీ ఫ్యాక్టర్ పనిచేయదని చెప్పారు. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపిన ఆయన.. ప్రస్తుతం తమ దృష్టంతా బీజేపీ ఓడించి, అధికారంలోకి రావడం పైనే ఉందని వెల్లడించారు. ఆ తర్వాతే సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.