- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు.. అభ్యర్థుల మూడో జాబితా విడుదల
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు పెంచింది. శనివారం మూడో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులో 43 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి లక్ష్మణ్ సవాడీకి ఊహించినట్లుగానే అథనీ స్థానాన్ని కేటాయించింది. మరోవైపు మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కొలార్ స్థానాన్ని కేటాయించలేదు. ఈ స్థానంలో కొతూర్ జి మంజూనాథ్‌ను నిలబెట్టింది.
కాగా, సిద్ధరామయ్యకు ఇప్పటికే వరుణ నియోజకవర్గాన్ని కేటాయించగా, మరో స్థానంగా కొలార్ కేటాయిస్తారని భావించారు. అయితే తాజా జాబితాలో ఆయనకు నిరాశే ఎదురైంది. ఇక మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా కుమారుడు నివేదిత్ అల్వాకు కుమ్ట స్థానాన్ని కేటాయించారు. తాజా జాబితాతో కాంగ్రెస్ ఇప్పటివరకు 209 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 15 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ 212 స్థానాలకు రెండు విడుతల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.