Karge: అబద్ధాలు చెప్పే బదులు అసలు సమస్యలపై మాట్లాడండి.. మోడీకి ఖర్గే సవాల్

by vinod kumar |
Karge: అబద్ధాలు చెప్పే బదులు అసలు సమస్యలపై మాట్లాడండి.. మోడీకి ఖర్గే సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాలపై నిరంతరం అసత్య ప్రచారం చేసే బదులు ధైర్యం ఉంటే అసలు సమస్యలపై మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendra modi)కి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Malli karjun karge) సవాల్ విసిరారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో ఆర్థిక సంక్షోభం (Economic crisis) సృష్టించిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అభివృద్ధి పనులకు నకిలీ కథనాలు ప్రత్యామ్నాయం కావని తెలిపారు. తక్కువ వినియోగం, ద్రవ్యోల్భణం, పెరుగుతున్న అసమానతలు, తక్కువ పెట్టుబడి వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థను పండుగల వాతావరణం కూడా పెంచలేక పోయిందని పేర్కొన్నారు.

‘2014-15, 2021-22 మధ్య, భారత శ్రామిక శక్తి యొక్క ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన కార్మికుల వేతనాలు 1శాతం (ILO) కంటే తక్కువగా పెరిగాయి. ఈ తాజా డేటాను మోడీ విశ్వసించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ ఎన్నికల ర్యాలీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై మాట్లాడండి’ అని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. కాగా, ఇటీవల ఓ సమావేశంలో భాగంగా మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ వాగ్ధానాలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మోడీ వ్యాఖ్యలకు ఖర్గే తాజాగా కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story