కల్పనా సొరేన్ వచ్చారు..జాగ్రత్త: జార్ఖండ్ సీఎంకు బీజేపీ వార్నింగ్

by vinod kumar |
కల్పనా సొరేన్ వచ్చారు..జాగ్రత్త: జార్ఖండ్ సీఎంకు బీజేపీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. కల్పనా సొరేన్ వచ్చేశారని, సీఎం చంపయీ సొరేన్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ప్రభుత్వం అంతర్గత గందరగోళాన్ని ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. ఏడు రోజుల్లోనే గణనీయమైన మార్పులు వస్తాయని తెలిపారు. రానున్న రోజులు జేఎంఎంకు చాలా కీలకమైనవని.. ముఖ్యమంత్రి చంపయీ సొరేన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ఇటీవల రాష్ట్రంలోని గాండేయ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా..కల్పనా సొరేన్ గెలుపొందారు.

Advertisement

Next Story