ఆ ఆలయంలో అమ్మవారికి చెమటలు.. 24 గంటల పాటు ఏసీ ఆన్ లో పెట్టాల్సిందే..

by Sumithra |   ( Updated:2024-10-11 16:25:15.0  )
ఆ ఆలయంలో అమ్మవారికి చెమటలు.. 24 గంటల పాటు ఏసీ ఆన్ లో పెట్టాల్సిందే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : భారతే దేశం అనేక పురాతన దేవాలయాలకు నెలవు. ఈ దేవాలయాలన్నీ మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైనవి. అలాగే ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే ఈ పురాతన ఆలయాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక మహిమాన్విత ఆలయం గురించి మనం తెలుసుకుందాం. మనం తెలుసుకునే ఆలయంలోని అమ్మవారికి ఎప్పుడూ చెమటలు పడుతూనే ఉంటాయట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మాతా కాళి ఆలయం ఉంది. గుడిలో ఏసీ ఆగినప్పుడల్లా అమ్మవారి విగ్రహానికి చెమటలు పడతాయని అక్కడి భక్తులు, పూజారులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు, దాన్ని నేరుగా చూసినప్పుడు భక్తులు ఓ అద్భుతంగా భావిస్తారు. అంతే కాదు ఇది కాళీ మాత దైవిక శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఘటన వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని కొందరి అభిప్రాయం. విగ్రహం తయారు చేసిన రాయి, ఆలయ వాతావరణంలో తేమ కారణంగా ఇలా జరుగుతుందని కొందరు నమ్ముతుంటారు. కానీ మరికొందరు ఇది దైవిక శక్తిగా చెబుతారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. అందుకే దీన్ని ఓ మిస్టరీగా చెబుతారు.

ఈ ఆలయంలో దర్శనం చేసుకుని, కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ఏడాది పొడవునా వివిధ మతపరమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

ఏసీ స్విచ్ ఆఫ్ చేయగానే అమ్మకి చెమటలు..

చలికాలంలో అంతా బాగానే ఉంటుందని స్థానికుల చెబుతున్నారు. అయితే వేసవి కాలం రాగానే మాత కాళీ విగ్రహానికి చెమటలు పడతాయని. ఆలయ పూజారి అమ్మవారి బట్టలు మార్చేసరికి అమ్మవారి బట్టలు తడిసి దర్శనమిస్తున్నాయంటున్నారు. అప్పటి నుంచి భక్తులు మాత కాళి ఆలయంలో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలం వచ్చినప్పుడల్లా ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ 24 గంటలు నడుస్తుంది. ఏదో ఒక కారణంతో ఏసీ ఆగిపోయినప్పుడల్లా మాత విగ్రహానికి మళ్లీ చెమటలు పడతాయని భక్తులు, ఆలయ పూజారి నమ్ముతారు. ఈ దేవాలయం 500 సంవత్సరాల పురాతనమైనది, దీనిని దేశవ్యాప్తంగా 'AC వలీ మాత కాళి' అని పిలుస్తారు.

Advertisement

Next Story