MP : ఆనాడే సీఎం రేవంత్ రెడ్డిలో విప్లవ నాయకత్వ లక్షణాలు గుర్తించాం

by Kalyani |   ( Updated:2024-10-11 11:19:35.0  )
MP : ఆనాడే సీఎం రేవంత్ రెడ్డిలో విప్లవ నాయకత్వ లక్షణాలు గుర్తించాం
X

దిశ, అచ్చంపేట : సీఎం రేవంత్ రెడ్డి పై నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల శంకుస్థాపన కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఉప్పురుంతల మండలం రాయిచడి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చంపేట పట్టణంలో డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఆ సభకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ రోజు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. సభ అనంతరం అక్కడనే రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని... ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డిలో "విప్లవ నాయకత్వ లక్షణాలను" ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. పాదయాత్ర అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియామకం తదుపరి ఎన్నికల పరిణామం అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం రేవంత్ రెడ్డి ఆనాటి పరిణామమే కారణమన్నారు.

ఇందిరాగాంధీల సీఎం రేవంత్ కు పేరు ప్రతిష్టలు..

దేశ స్వాతంత్ర అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బ్రాహ్మణ అయినప్పటికీ ఈ దేశంలో ఉన్న దళిత, గిరిజన, బడుగు వర్గాల ఆశాజ్యోతి గా నేటికీ ఎలా పేరు ప్రతిష్టలు పొందిందో... అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా విప్లవాత్మక లక్షణాలతో అన్ని వర్గాల అభివృద్ధి విద్య, వైద్యం పేదలకు మరింత చేరువ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం నిమగ్నమై ఉందని అందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్వశక్తుల కృషి చేస్తూ, రాష్ట్రం అప్పులల్లో ఉన్న సంక్షేమ పథకాల అమలు, అలాగే విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

Next Story