Leopard Attack: యూపీలో చిరుత దాడిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

by Shamantha N |
Leopard Attack: యూపీలో చిరుత దాడిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ వాసులను మొన్నటిదాకా తోడేళ్ల బెడద పట్టిపీడించగా.. ఇప్పుడు చిరుతల దాడితో బెంబేలెత్తుతున్నారు. చిరుత పులుల వరుస దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శక్రవారం చిరుత దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బిజ్నోర్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో తాన్య(8) అనే చిన్నారి పశువుల మేత కోసం తల్లితో కలిసి దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది. చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను కొట్టడంతో.. అది చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. చిరుతను గుర్తించేందుకు కెమెరా ట్రాప్ లు, థర్మల్ డ్రోన్లను వాడుతున్న అటవీ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకపోతే, ఇటీవలే చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీ(Lakhimpur Kheri)లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Next Story