Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీకి ఆప్ మద్దతు.. ఎల్జీకి లేఖ

by vinod kumar |   ( Updated:2024-10-11 11:18:11.0  )
Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీకి ఆప్ మద్దతు.. ఎల్జీకి లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మద్దతిచ్చింది. ఈ మేరకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ లేఖ రాశారు. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్టు తెలిపారు. దీంతో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్సీకి సొంతంగా 42 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పటికే నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో తాజాగా ఆప్ మద్దతివ్వడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. కాంగ్రెస్ మద్దతు సైతం ఎన్సీకి ఉంది. కాగా, జమ్మూ కశ్మీర్‌లో ఆప్ తొలిసారిగా ఖాతా తెరిచింది. దోడా స్థానం నుంచి ఆ పార్టీకి చెందిన మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్సీకి మద్దతిచ్చారు. అయితే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ ఎన్నికలకు ముందు ఎన్సీ, కాంగ్రెస్‌తో కాకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. దీంతో ఎన్నికల అనంతరం తిరిగి ఎన్సీకి మద్దతివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story