నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-11 15:24:31.0  )
నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former Dharmavaram MLA Ketireddy Peddareddy) అన్నారు. తనకు, తన కుటుంబానికి జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్(SP Jagadish) సహకారంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ నుంచి చాలా సార్లు తనపై హత్యాయత్నం కుట్రలు జరిగాయని చెప్పారు. 2006లో తన అన్న సూర్యప్రతాప్‌రెడ్డిని చంపారని వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గుండాలకు సాక్షాత్తు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తనపై 3 హత్యాయత్నం కేసులు పెట్టారని చెప్పారు. ఎస్పీ అనుమతి తీసుకుని తాడిపత్రి వెళ్లినా తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు తపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story