జూన్-28: జాతీయ భీమా అవగాహన దినోత్సవం..

by Hamsa |
జూన్-28: జాతీయ భీమా అవగాహన దినోత్సవం..
X

దిశ, ఫీచర్స్: ప్రతి ఏడాది జూన్ 28న జాతీయ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేను నిర్వహించుకుంటారు. అయితే భీమా కట్టడం వల్ల అనేక రకాలు ప్రయోజనాలున్నాయని ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజును జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కారు భీమా నుండి జీవిత భీమా వరకు గృహ ఇలా అన్నింటికీ కవరేజీని అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భీమా పథకాలు పేత ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే భీమా కట్టడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈడబ్బులు సరైన సమయంలో అందుతాయి.

దీంతో చికిత్సను పొంది ప్రాణాల నుండి బయటపడవచ్చును. అయితే భీమా విభిన్న పరిస్థితులలో భద్రతను అందిస్తుంది. ఇది నష్టాలను తిరిగి పొందగలదు. మరణం, అనారోగ్యం లేదా నష్టం సంభవించినప్పుడు ప్రియమైన వారిని రక్షించగలదు. కాబట్టి ప్రజలు తమ భీమా పథకాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. భీమా లండన్ గ్రేట్ ఫైర్ చుట్టూ ఎప్పుడో ఉనికిలోకి వచ్చింది తెలుస్తోంది. అక్కడ జరిగిన వినాశనం ఆస్తి భీమా ఆలోచనను తీసుకువచ్చింది. ఈ సమయం వరకు భీమాను కొంత సౌలభ్యంగా పరిగణించినప్పటికీ, లండన్ నివాసులకు భీమా అనేది విపత్తు సంభవించినప్పుడు మొత్తం ఎస్టేట్‌ను రక్షించగలదని అనుకునేవారు. కానీ ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడే భీమా కూడా వచ్చి మేలు చేస్తోంది.

Next Story

Most Viewed