సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అల్లరి నరేష్ సినిమా.. ఆసక్తికరంగా పోస్టర్

by Hamsa |
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అల్లరి నరేష్ సినిమా.. ఆసక్తికరంగా పోస్టర్
X

దిశ, సినిమా: హీరో అల్లరి నరేష్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్లలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బచ్చల మల్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఒక్కటొక్కటిగా విడుదలవుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో.. నేడు జూన్ (30) అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

అంతేకాకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘‘మీరు అతని కంటి చూపు నుంచి తప్పించుకోలేరు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై 29వ సినిమాగా తెరకెక్కనుండగా.. అల్లరి నరేష్ 63వ చిత్రం కావడం విశేషం. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో మూడు చేతులు ఏదో సంకేతం ఇస్తున్నట్లుగా చూపించారు. అయితే ఈ సినిమాకు మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను అర్థం చేసుకునేందుకు నెటిజన్లు తెగ ట్రై చేస్తున్నారు.

Next Story

Most Viewed