AP News:వికలాంగుడి పెన్షన్ కోసం మోటార్ సైకిల్ పై ‘నిమ్మల’ వినూత్న ప్రయత్నం

by Jakkula Mamatha |
AP News:వికలాంగుడి పెన్షన్ కోసం మోటార్ సైకిల్ పై ‘నిమ్మల’ వినూత్న ప్రయత్నం
X

దిశ, పాలకొల్లు:ప్రజా సమస్యలు తీర్చడంలో పాలకొల్లు ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పుడు నూతన పంథాయే. సామాన్యుడి సమస్య అనగానే ముందుండే రామానాయుడు సోమవారం పెన్షన్ల పంపిణీలో ప్రజలే దేవుళ్ళు అనేలా కాళ్ళు కడిగి మరీ పెన్షన్ పంపిణీ చేయడం ప్రశంసలు పొందింది. తాజాగా వికలాంగుడి సమస్య పరిష్కారంలో తన పంథాను మరోసారి ఆవిష్కరించారు. పాలకొల్లుకు చెందిన అతనికి 100 శాతం వికలాంగత్వం ఉన్న పెన్షన్ రద్దు కావడంతో మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం తన పెన్షన్ తొలగించిందని గోడు వెళ్లబోసుకున్న దివ్యాంగుడికి మంత్రి నిమ్మల రామానాయుడు భరోసానిచ్చారు. మంగళవారం నీ పెన్షన్‌నా బాధ్యతంటూ దివ్యాంగుడికి మంత్రి నిమ్మల హామీ ఇవ్వటమే కాక బైక్‌ పైన ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం వలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛన్లు పంపిణీ జరగదని వైసీపీ అసత్య ప్రచారంకు టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. పింఛన్లు కోసం ఎండల్లో తిరిగి చనిపోయిన 34 మంది మరణానికి జగన్ మోహన్‌రెడ్డి కారణం అయ్యారన్నారు.పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశానని, గత ప్రభుత్వంలో జగన్ కనీసం దివ్యాంగులకు ఒక్క రూపాయి పింఛన్ పెంచలేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed