మొక్కలను అందరూ విధిగా రక్షించాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Aamani |
మొక్కలను అందరూ విధిగా రక్షించాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ,దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలో వనమహోత్సవం భాగంగా లోలం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. లోలం లో బీమన్నా ఆలయ సమీపంలో వేయి మొక్కలు నాటే కార్యక్రమన్ని ప్రారంభించారు. మొక్కలు నాటడం తో పాటు విధిగా వాటిని సంరక్షించాలని అధికారులను కోరారు. వాటిని సంరక్షణ బాధ్యత ఎవరిదని అడగగా వాటి నిర్వహణ కోసం డబ్బులు ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా చెల్లిస్తారని, గ్రామ పంచాయతీ బాధ్యత అని అధికారులు తెలిపారు.

లోలం గ్రామ ప్రజలు పలు సమస్యలు ప్రస్థావించిగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు విడుదల చేయడం లేదని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కేంద్రం నిధులు ఎన్ ఆర్ ఈ జి యస్ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. అంతకు భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహేశ్వర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆర్ అండ్ బి నిధులతో బైంసా వెళ్లే జాతీయ రహదారి నుండి గుండంపల్లి గ్రామం వరకు రెండుదారుల రహదారి కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీడీవో అరుణ రాణి, తాసిల్దార్ స్వాతి,ఎంపీవో అజీజ్ ఖాన్, ఏపీవో దివ్య రెడ్డి, ఏపిఎం సులోచన రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, జడ్పీటీసీ రమణారెడ్డి, మంద మల్లేష్,సత్యం చంద్రకాంత్, వీరేష్ కుమార్, అచ్యుత రావు, పోలా విక్రమ్,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed