వర్షాకాలం తులసి ఆకులతో చేసిన టీ తాగితే సీజనల్ వ్యాధులు పరార్!

by Hamsa |
వర్షాకాలం తులసి ఆకులతో చేసిన టీ తాగితే సీజనల్ వ్యాధులు పరార్!
X

దిశ, ఫీచర్స్: ఉన్నంటుండి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇన్నాళ్లు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అయిన జనాలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. కానీ సీజనల్ వ్యాధులకు గురించి భయపడిపోతున్నారు. కొందరైతే అప్పుడే పలు చిట్కాలు ఫాలో అయిపోతున్నారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి పలు రకాల ఫ్రూట్స్, ఆహార పదార్థాలను తినడం మానేశారు. అంతేకాకుండా ఆయుర్వేద చిట్కాలతో ఉపశమనం పొందాలని చూస్తున్నారు. అయితే భాతరదేశంలోని అందరి ఇళ్లలో ఉండే తులసి మొక్క సీజనల్ వ్యాధులకు తగ్గించడంతో పాటుగా పలు రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ ఆకులతో టీ కనుక పెట్టుకుని తాగితే రోగాలు పరార్ అవుతాయని అంటున్నారు.

తులసి ఆకుల్లో ఉండే కాల్షియం, మినరల్స్, ఖనిజాలు, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్ వంటివి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా తులసి ఆకులతో చేసిన టీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వర్షంలో తడవటం వల్ల గొంతు నొప్పి దగ్గు, జలుబు వంటి సమస్యలు తీవ్రతరం అయి ఏ పని చేయకుండా చేస్తాయి. కాబట్టి తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి వడకట్టిన నీటిని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులు ఉదయం నిద్రలేవగానే నమలకుండా మింగాలి ఇలా చేయడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంది. చాలామందికి వర్షాకాలం వచ్చిందంటే చాలు పలు రకాల అలర్జీలు రావడంతో నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి వారు తులసి ఆకులతో చేసి టీని తాగితే ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్లను, అలర్జీలను తగ్గిస్తుంది.

ఈ టీ తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వంటివి బాధపెడుతుంటాయి. దీంతో అతలాకుతలం అయితుంటారు. ఎలా తగ్గించుకోవాలనే ఆలోచనలతో వంటింట్లో దొరికే పదార్థాలను వాడుతుంటారు. కానీ తులసి టీ తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. అలాగే తులసిలో ఎక్స్‌పెక్టరెంట్, డికాంగెస్టెంట్ లక్షణాలు ఉండి సీజలన్ సమస్యలు దగ్గు, జలుబు, సైనస్, శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. వర్షాకాలం తులసి ఆకులతో చేసిన టీ లేదా కషాయం, తులసి ఆకుల నీరు తాగితే హెల్తీ గా ఉండవచ్చు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరి చేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారం తీసుకోబడింది. ఇది పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనిని దిశ ధృవీకరించదు.

Next Story

Most Viewed