- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Priyanka Gandhi: రాజ్యంగం చేతపట్టుకుని.. లోక్ సభ ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. శీతాకాల సమావేశాల్లో(Parliament Winter Session) భాగంగా పార్లమెంట్‌లోకి ఎంటరయ్యారు. ఇటీవల వయనాడ్(Wayanad MP) లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె.. గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం పుస్తకం చేత పట్టుకుని ఆమె ప్రమాణం చేయడం విశేషం. సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు వెంట రాగా.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో ఆమె సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఇక, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్ వసంతరావు (Ravindra Chavan Vasantrao) కూడా ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.
ఉపఎన్నిక
ఇకపోతే, వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ పై 4,08,0036 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానంలో అత్యధిక ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు ప్రియాంకాగాంధీ సోదరుడు రాహుల్‌గాంధీ పేరిట ఉంది. 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో రాహుల్ గతంలో విజయం సాధించారు. ఇప్పుడు ప్రియాంకాగాంధీ ఆ రికార్డును బద్ధలు కొట్టారు.