ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

by Sridhar Babu |
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
X

దిశ, చందుర్తి : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం కార్యక్రమానికి ఆయన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ పాల్గొన్నారు. చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విప్​ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయానికి తనకు విడదీయరాని బంధం ఉన్నదని, 18 సంవత్సరాల అనంతరం మళ్లీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్​గా ఈ కార్యాలయంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. ఇదే మండలం నుండి ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అనేక శాఖలో అవకతవకలు సరిదిద్దుకోవాలని, ముఖ్యంగా చందుర్తి మండలానికి సంబంధించిన మోత్కరావుపేట, చందుర్తి గ్రామాలను కలిపే ఈ రోడ్డు 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, దీర్ఘకాలికంగా రోడ్డు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేపిస్తామని అన్నారు.

ఎవరికైతే ఇల్లు లేవో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇస్తామని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పనులను తెలియజేస్తూ వివరించారు. అందులో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతుల సంఖ్య 139 గా నమోదు చేయగా, ఇదే ఐసీడీఎస్ శాఖలో ఇదే గర్భవతుల సంఖ్య 203 నమోదు చేయగా అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎవరికి తోచిన విధంగా వారు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సమన్వయ లోపంతో పని చేయడం కాదు సక్రమంగా పనిచేయాలని సూచించారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద మండలంలో మొత్తం జాబు కార్డుల సంఖ్య 7932 నమోదు చేయగా ఇందులో నాలుగు వేల 38 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారని రికార్డులో చూపించారు. ఇంత వ్యత్యాసం ఏమిటని సదరు అధికారి అయిన ఏపీవో రాజయ్యను ఎమ్మెల్యే ప్రశ్నించారు. దానికి సమాధానంగా మరలా జరగకుండా చూసుకుంటామని అధికారి సమాధానమిచ్చారు.

అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారిని మండలంలో వివిధ గ్రామాల్లో కరెంటు సరిగా ఉండడం లేదంటూ ఏఈ ని ప్రశ్నించారు. కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో ప్రజలు ప్రభుత్వాన్ని తప్పు పడతారని, సమయానికి కరెంటు పోతే ఆ బాధ్యత లైన్ మెన్ దేనని, గ్రామాల్లో అందుబాటులో లైన్మెన్ ఉంచాలని ఎంపీటీసీ లు కోరారు. అలాగే స్త్రీ శక్తి భవనం శిథిలావస్థకు చేరుతున్నదని దిశాపత్రికలో ముద్రించగా ఈ కథనం పైన జోగాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మేకల గణేష్ అధికారులను నిలదీశారు. దీనిపైన ఎమ్మెల్యే సదరు డీఈ, ఏఈలకు వెంటనే శ్రీ శక్తి భవనానికి సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసి ఆ భవనాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్ పర్సన్ నాలకొండ అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేస్తే మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో తిప్పని శ్రీనివాస్, సస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్ , డీసీసీ డైరెక్టర్ జలగం కిషన్​రావు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed