BREAKING: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC కీలక సూచన

by Satheesh |
BREAKING: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, అమీర్ పేట్, పటాన్ చెరు, మియాపూర్, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, బేగంపేట్, మేడ్చల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం వీకెండ్ కావడంతో కుటుంబంతో సరదాగా బయటకు వచ్చిన నగరవాసులు వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో, కొన్ని ఏరియాల్లో వర్షానికి చెట్లు, స్థంభాలు విరిగిపడటంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ వర్షం నేపథ్యంలో సిటీ ప్రజలకు అధికారులు కీలక సూచన చేశారు. అవసరం అయితేనే ఇండ్ల నుండి బయటకు రావాలని సూచించారు.

Next Story

Most Viewed