అతని కోసమే టాటూ వేయించుకున్న.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రద్ధ

by sudharani |
అతని కోసమే టాటూ వేయించుకున్న.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రద్ధ
X

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో చాలా మంది శరీరాలపై టాటూలు చూస్తుంటాము. ఒక్కొక్కరు ఒక్కో అర్థం వచ్చేలా వాటిని వేసుకుంటారు. అలాగే సెలబ్రెటీలు కూడా ఎక్కువగా టాటూస్‌పై మక్కువ చూపిస్తారు. ఇలాంటి టాటూల వెనుక ఏదో ఒక అర్థం, పరమార్థం ఉండే ఉంటుంది. ఈ క్రమంలోనే తన చెస్ట్‌పై ఉన్న టాటూకు మీనింగ్ చెప్పింది శ్రద్ధా శ్రీనాథ్. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈమె.. తెలుగులో రెండు, మూడు మూవీస్ తీసినప్పటికీ.. తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ.. తన చెస్ట్‌పై ఉన్న టాటూకు అర్థం ఏంటో చెప్పింది. ‘18 ఏళ్ల వయసులోనే ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అప్పట్లో బీటల్స్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ఒకటి ఉండేది. దానిని నాకు పరిచయం చేసింది అతడే. నా టాటూపై ఉన్నది ఆ బ్యాండ్‌ ఆల్బమ్‌ కవరే. దాని మీనింగ్ ప్రేమ. అలా నా మొదటి క్రష్‌పై, బ్యాండ్‌పై ఉన్న ఇష్టాలను కలిపి టాటూ వేయించుకున్నా. ఇక తెలిసీ తెలియని వయసులో నా ఫస్ట్‌ క్రష్‌ కోసం వేయించుకున్న ఆ టాటూ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే’ అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధా శ్రీనాథ్.

Next Story

Most Viewed