తన డ్రీమ్ త్యాగం చేసి సినిమాల్లోకి వచ్చిన పాన్ ఇండియా హీరోయిన్..

by sudharani |
తన డ్రీమ్ త్యాగం చేసి సినిమాల్లోకి వచ్చిన పాన్ ఇండియా హీరోయిన్..
X

దిశ, సినిమా: ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ.. ‘కల్కి’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ చిత్రంలో దిశా ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజెంట్ తెలుగులో ‘మట్కా, లక్కీ బాస్కర్’, తమిళంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీతో కూడా అలరించడానికి సిద్ధం అవుతుంది.

అయితే.. ఇప్పుడు ఇంత స్టార్ స్టేటస్‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తన డ్రీమ్‌ను త్యాగం చేసి సినిమాల్లోకి రావాల్సి వచ్చిందట. అసలు విషయం ఏంటంటే.. దిశా పటానీ తండ్రి పోలీస్ అధికారి, తల్లి హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్, అలాగే అన్న లెఫ్ట్ నెంట్ కల్నల్. దీంతో తను కూడా దేశ సేవలో భాగమవ్వాలనుకుని.. ఆర్మీలో ఫైటర్ జెట్ నడిపే పైలెట్ కావాలనుకుందట. అందుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకోగా.. ఫిట్నెస్ పరంగా ఆ ఉద్యోగానికి అర్హురాలు కాలేకపోయిందట. ఇక ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో తన డ్రీమ్ మధ్యలోనే వదిలేసి.. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది దిశా పటానీ.

Next Story

Most Viewed