థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు వాస్తవమే

by Sridhar Babu |
థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు వాస్తవమే
X

దిశ,మణుగూరు : గత రాత్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డ్ ప్రాంతంలో పిడుగుపడింది వాస్తవమేనని హైదరాబాద్ జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య తెలిపారు. విద్యుత్ కేంద్రంలో అమర్చిన సీసీ ఫుటేజ్ ద్వారా పిడుగు పడటాన్ని గమనించామని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. శనివారం భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడిందని సమాచారం తెలుసుకొని హైదరాబాద్ జెన్కో థర్మల్ అధికారులు ఆదివారం భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్విచ్ యార్డ్ ప్రాంతంలో దగ్ధమైన విద్యుత్ అవుట్ ఫుట్ ట్రాన్స్ఫార్మర్లు క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అవుట్ ఫుట్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లపై పిడుగు పడిందని తెలిపారు. దీంతోనే విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ల లో ఉండే కరెంట్ ఆయిల్ కారణంగా మంటలు ఉధృతమైనట్టుగా గుర్తించామన్నారు. ఈపిడుగుపాటుతో పవర్ కేంద్రానికి సుమారు 25కోట్ల ఆస్తినష్టం జరిగిందన్నారు. ఈప్రమాదంలో ఆస్తినష్టం తప్ప ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ఈ ప్రమాదం వల్ల మొదటి యూనిట్లో 270 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, త్వరలో మొదటి యూనిట్ ఉత్పత్తి పునరుద్ధరణకు పూర్తి చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్యతో పాటు సీఈ బిచ్చన్న తదితర విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed