KGF హీరోలా రాహుల్ ఫోజ్.. బ్రహ్మపుత్ర నదిపై జోడో న్యాయ్ యాత్ర

by GSrikanth |
KGF హీరోలా రాహుల్ ఫోజ్.. బ్రహ్మపుత్ర నదిపై జోడో న్యాయ్ యాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన యాత్ర ప్రస్తుతం అస్సాంలో జరుగుతున్నది. అయితే 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' బ్రహ్మపుత్ర నది మీదుగా జోర్హాట్‌లోని నిమతి ఘాట్ నుంచి మజులి వరకు పడవలో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులు, పాదయాత్రలే కాకుండా పడవ యాత్ర చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా రాహుల్ న్యాయ్ యాత్రపై అస్సాంలో తాజాగా కేసు నమోదు అయ్యింది.

అయితే రాహుల్‌ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని, యాత్ర నిర్వాహకుడు కేబీ బైజూపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుపై కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. ఎన్ని ఆటంకాలు కలిగించిన జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని, ప్రజల గుండెల్లో రాహుల్ ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ పలువురు నేతలు బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed