Jammu and Kashmir: కేంద్రపాలిత హోదా తాత్కాలికమే.. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2024-10-29 11:35:03.0  )
Jammu and Kashmir: కేంద్రపాలిత హోదా తాత్కాలికమే.. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ కు కేంద్రపాలిత హోదా తాత్కాలికమేనని తనకు హామీ లభించిందని అన్నారు. శ్రీనగర్‌లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో మాట్లాడిన అబ్దుల్లా.. ఢిల్లీలో మోడీతో భేటీ గురించి ప్రస్తావించారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, జమ్ముకశ్మీర్ పాలనను మెరుగుపరచడం వంటి కట్టుబాట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. “కొంతమంది వ్యక్తులు సిస్టమ్‌ను దోపిడీ చేయడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుతానికి జమ్ముకశ్మీర్ లో ఉన్న సిస్టమ్‌లో లొసుగులను చూడొచ్చు. కానీ ఇది తాత్కాలిక దశ. ఢిల్లీకి వెళ్లిన సమావేశాలు విజయవంతం అయ్యాయి. పాలనవిధానంలో మార్పులు జరుగుతున్నాయని హామీ వచ్చింది. రాష్ట్ర హోదా ఏర్పడ్డాక సిస్టమ్ లో ఎలాంటి లొసుగులు ఉండవు”అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే..

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరగవచ్చని ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి జమ్ముకశ్మీర్ కేబినేట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. అప్పుడు కేబినేట్ ఆమోదించిన తీర్మానాన్ని ఆయనకు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed